కార్తీక మాసం రెండవ సోమవారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డీసీపీ రాజమహేంద్ర నాయక్ దంపతులు.
- జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం - November 23, 2026
- రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు - November 23, 2026
- పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు - November 23, 2026
జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్ (ఐపీఎస్) దంపతులు పాల్గొన్నారు. తొలుత శివపార్వతుల పల్లకీ సేవలో పాల్గొన్న డీసీపీ దంపతులు, అనంతరం కార్తీక మాస ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన ఆకాశ జ్యోతిని వెలిగించారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
