అగ్రస్థానంలో మెరిసి మురిపించిన సాన్ మారియా విద్యార్థులు
- జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం - November 23, 2026
- రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు - November 23, 2026
- పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు - November 23, 2026

జనగామ పట్టణంలోని విద్యలో నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే కాక ఆటపాటలలో విద్యార్థులను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న పాఠశాలగా సాన్ మారియా స్కూల్ జనగామ జిల్లా ప్రజల మన్ననలు పొందుతుంది. జనగామ జిల్లా కలెక్టర్ కప్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల్లో జనగామ లోని సాన్ మారియా సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు చి. రితేష్ రెడ్డి, బి. సాన్వి ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు సాధించిన ఈ విజయంపై పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పేర్కొన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో పాటు సాన్ మారియా పాఠశాల యాజమాన్యం జగన్ మోహన్ రెడ్డి నీరజ, మరియు ప్రిన్సిపల్, మేనేజర్, ఉపాధ్యాయ బృందం విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
