గాయపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌కు పరామర్శ

జనగామ, సెప్టెంబర్ 18: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు హుస్సేన్ నాయక్ శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి, నాయకులు కళ్యాణి, స్వప్న, ఎస్సీ మోర్చా నాయకులు డాక్టర్ సెల్ నాయకులు పెద్ది శశిధర్ గుప్తా, కుడుముల అనిల్ కుమార్, ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్ కరీంనగర్ పూర్ణచందర్, పట్టణ కార్యదర్శి దూసరి శివకృష్ణ, మోతే జనార్ధన్, ఎస్టీ మోర్చా నాయకులు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...