పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు
- జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం - November 23, 2026
- రాచకొండ రాములు చిత్రపటానికి రియల్ ఎస్టేట్ యూనియన్ నాయకుల నివాళులు - November 23, 2026
- పాలకుర్తిలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. భక్తులకు ఆలయ ఈవో పిలుపు - November 23, 2026

కార్తీక పౌర్ణమి సందర్భంగా పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఆలయ గుట్టపై భారీ ప్రమిదలో టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో జ్యోతి వెలిగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి శ్రీ స్వామి దుర్గానందపురి మహారాజ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరవుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈవో కోరారు.
