వెల్దండలో రూ.5.60 కోట్ల అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం.. పాల్గొంటున్న ఎంపీ ఎమ్మెల్యే

1001387182.jpg

వెల్దండ నవంబర్ 22 :వెల్దండ మండలంలో రూ.5.60 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెల్దండలో నూతన పీఏసీఎస్ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.అనంతరం అల్లం తోట బావి తండా, శిలోని భావితండా, శంకర్ కొండ తండాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్డు పనులకు భూమిపూజలు చేయనున్నారు. పలుగు తండాలో రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు.ఈ వివరాలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూడవత్ హరికిషన్ నాయక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఈ సమావేశంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్లు శంకర్ నాయక్, పుల్లయ్య, మల్లేష్ ముదిరాజ్, రఘునాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...