చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

చారగొండ: చారగొండ మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

రైతు వేదికలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు 1001337965.jpg

ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.సమావేశంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

You may also like...