చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు

1001312830.jpg

తలకొండపల్లి అక్టోబర్ 30: రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాజీ ఎంపిటిసి రాములు ఆరిఫ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకై ఢిల్లీలో చేపట్టిన పోరాటానికి పూర్తి మద్దతుగా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాట్లాడుతూ.. దేశంలో రైతులు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా మారి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాహుల్ గాంధీ గారు రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రజాపోరాటానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల అధ్యక్షులు ఆరిఫ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

You may also like...