మాడుగులలో సుంకిరెడ్డి 26వ జాబ్ డ్రైవ్ కు విశేష స్పందన
- మాడుగులలో సుంకిరెడ్డి 26వ జాబ్ డ్రైవ్ కు విశేష స్పందన - October 28, 2026
- కల్వకుర్తిలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం - October 26, 2026
- జూపల్లి గ్రామపంచాయతీ నూతన కార్యదర్శికి ఘన స్వాగతం - October 26, 2026

కల్వకుర్తి (మాడుగుల) : గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్- సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా మాడుగుల మండల కేంద్రంలోని శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ లో ఈరోజు నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్ కు యువత నుండి విశేష స్పందన లభించింది. ఈ జాబ్ డ్రైవ్ ను 400 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు సందర్శించగా, వీరిలో అర్హత కలిగిన 217 మందికి ఇంటర్వ్యూ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. ఎంపికైన వారికి విడతల వారీగా నియామక ప్రక్రియ కొనసాగనుంది.ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ… యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ యువతలో ఎంతో ప్రతిభ ఉన్నా, సరైన సమాచారం, కంపెనీలతో పరిచయాలు లేక అవకాశాలు కోల్పోతున్నారని, అలాంటి వారికి కంపెనీలను నేరుగా పరిచయం చేయడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమన్నారు. ఒక యువకుడు ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుందని, మాడుగుల యువతకు భవిష్యత్తులో మరిన్ని జాబ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
తమ మండలంలోనే జాబ్ డ్రైవ్ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి, ఐక్యత ఫౌండేషన్ కు యువత కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ప్రతినిధులు LN కౌశిక్ మరియు వారి HR టీం, ఫౌండేషన్ మండల ఇంచార్జి సూదిని జైపాల్ రెడ్డి, పరిసర గ్రామాల సర్పంచ్ లు శ్రీను నాయక్, వార్డు సభ్యులు సైదులు, దర్శన్ సైదమ్మ, జంగయ్య, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ బాబా, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నాగిళ్ళ శివ, ఎరుకలి శివ, సుధాకర్, యూసఫ్, మణికుమార్, శివకుమార్, కెంచె శివ తదితరులు పాల్గొన్నారు.
