గీత కార్మికుడి కుటుంబానికి ఖానా ట్రస్ట్ ఆర్థికసాయం అందజేత
- గీత కార్మికుడి కుటుంబానికి ఖానా ట్రస్ట్ ఆర్థికసాయం అందజేత - October 27, 2026
- టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి : కావలి యాదయ్య - October 26, 2026
- ఉద్యమకారుల ముందస్తు అరెస్టు - October 26, 2026
గీత కార్మికుడి కుటుంబానికి ఖానా ట్రస్ట్ ఆర్థికసాయం అందజేత
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 27: మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు కట్ట సైదులు పక్షవాతంతో మంచానికే పరిమితం కావడంతో ఆయన కుటుంబానికి మంగళవారం కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఖానా) ట్రస్ట్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించింది. కల్లుగీత కార్మిక సంఘం నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు నాతి గణేష్, బాల్నె రామచంద్రుడు, బల్గూరి వెంకట్ సహకారంతో ఈ సాయం అందజేశారు. కుటుంబాన్ని ఆదుకున్న ట్రస్ట్ సభ్యులకు సైదులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దండంపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మాద శ్రీను, నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
