ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవీ ప్రసాద్
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేవీ ప్రసాద్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : గ్రామీప ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ కేవీ ప్రసాద్ అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆప్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు చిక్కు శేఖర్, చిక్కు సతీష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటిస్, కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో 40 మందిని కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు. కార్యక్రమంలో జెన్ చైర్ పర్సన్ డెంటల్ సత్యనారాయణ, యర్ర శంభులింగారెడ్డి, సర్పంచ్ విప్పలపల్లి అనిత, క్లబ్ అధ్యక్షులు గుడిపాటి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి మంగదుడ్ల శ్రీనివాస్, కోశాధికారి కల్లూరి వెంకటేశ్వర్లు, క్లబ్ సలహాదారులు రెడ్డిపల్లి సాగర్, చిక్కు శేఖర్, సభ్యులు కడవేరు మల్లికార్జున్, బొడ్డుపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
