పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కట్టంగూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత, కస్తూర్భాగాంధీ, అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు సాందీపని, ఎస్ఎస్పీఎన్, గీతాంజలి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓ శ్రీలత, హెచ్ఎంలు అంబటి అంజయ్య. పోగుల రాములు. ఉపాధ్యాయులు కనకదుర్గ, మహాలక్ష్మి, తేజస్విని, జయమ్మ, నీరజ, శ్రీదేవి, షాహిదా, మాధవి, శైలజ, యాదమ్మ, రిజ్వాన్, రేణు, పద్మ, మంగ, శ్రీలేఖ్య, మాధవి, శిరీష, సునీత, విజయలక్ష్మి, లక్ష్మి, పావని తదితరులు పాల్గొన్నారు.
