తాళం వేసిన ఇంట్లో చోరీ….

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ అయిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూర్ కు చెందిన గీత కార్మికుడు యర్కల పాండు కల్లు గీసేందుకు ఇతర రాష్టం వెళ్లాడు. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగటగొట్టి బీరువాలో ఉన్న అర తులం బంగారం, 30 తులాల వెంటి పట్టా గొలుసులు అపహరించుకుపోయారు. ఆదివారం రాత్రి పాండు కుమారుడు ఉమేష్ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. సోమవారం ఉమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ అంజయ్య తెలిపారు.

You may also like...