పారిశుద్ధ్య కార్మికులకు సత్య సాయి చీరల పంపిణీ

1001246470.jpg

వెల్దండ:మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం చీరలు పంపిణీ చేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి గిరిగౌడ్, సేవా సంస్థ నిర్వాహకులు లక్ష్మణ్, గిరిజ, సువర్ణ, మాధవి, లత, అనిత తదితరులు పాల్గొన్నారు.

You may also like...