ఘనంగా కరీం భాయ్ బామ్మర్దుల రిసెప్షన్ వేడుక

1001246464.jpg

ఆమనగల్:పట్టణానికి చెందిన ప్రముఖ స్క్రాప్ వ్యాపారవేత్త కరీం భాయ్ బామ్మర్దుల వివాహ రిసెప్షన్ వేడుకను షాద్‌నగర్‌లోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకుడు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రామన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ‘షాదీ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు నూతనగంటి భాస్కర్, శ్రీను నాయక్, ప్రేమ్, హాజీ బాయ్, జానీల్, అబ్దుల్ మజార్, ఖలీల్, ముజాహిద్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొన్నారు.

You may also like...