స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్‌ గుల్లి నరేష్‌

స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్‌ గుల్లి నరేష్‌

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 7: ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునుకుంట్ల గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్‌ అన్నారు. మండలంలోని మునుకుంట్ల గ్రామంలో బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. రేషన్‌ కార్డుల పంపిణీతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కడారి మల్లేష్‌, పంచాయతీ కార్యదర్శి ముషం భవాని, వార్డు సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

You may also like...