పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి : తాసీల్దార్ పుష్పలత
- పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి : తాసీల్దార్ పుష్పలత - September 30, 2026
- వైద్య విద్యార్థుల ఉదారత: - September 30, 2026
- ఖమ్మం మహాసభలకు తరలివెళ్లిన ఏఐకేఎంఎస్ శ్రేణులు - September 28, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 30 : పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకొని సర్పంచ్ అకిటి శంకర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సయన్వయంతో పని చేయాలని సూచించారు. సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీ మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని కాలనీ వాసులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ మునుగోటి రవీందర్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టపరమైన మార్గంలో అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, పౌర హక్కులపై ప్రజలకుఅ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ మునుగోటి రవీందర్, అర్ ఐ జీవీఎస్ రామారావు, జీపీఓ జనార్దన్, పంచాయతీ కార్యదర్శి, పీల్డ్ అసిస్టెంట్, అంగన్ వాడీ టీచర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

