చంద్రయాన్ పల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో చంద్రయాన్ పల్లి లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం  గ్రామ సర్పంచ్ కోస్గి శివ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ది దారుణికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. వీటి ద్వారా రేషన్ సరుకులు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ కుమార్, ఉప సర్పంచ్ వెంకటేశం, గ్రామ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ స్వామి, గ్రామ పెద్దలు, యువకులు, ద్వారా మహిళలు పాల్గొన్నారు.

You may also like...