మొయినాబాద్ మున్సిపాలిటీ టి ఆర్ ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు ఫాతిమా ఖాన్ నియామకం
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పంచ జన్య సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారు అన్ని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ బేగరి రాజు అన్నారు సోమవారం నాడు మొయినాబాద్ మండల కేంద్రం లో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ శ్రీమతి ఫాతిమా ఖాన్ ను టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి బేగరి రాజు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుమ్మరి శివ శంకర్, చేవేళ్ల నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు ఫైమీద పాషా నియామక పత్రాన్ని అందజేశారు ఈ నేల 20 న తలపెట్టిన చలో కొడంగల్ పంచ జన్య సంకల్ప సభను విజయవంతం చేయండి టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు కుమ్మరి శివశంకర్ ప్రజాపతి చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి బేగరి రాజు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలలో తెలంగాణ రక్షణ సేన అనతి కాలంలోనే అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని కల్వకుంట్ల శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ పంచ జన్య సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తున్నారని రానున్న తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం పంచ జన్య ప్రజలకు వివరిస్తూ 20వ తేదీన జరిగే కొడంగల్ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి అన్వర్, టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల అధ్యక్షులు మేకగూడెం బిక్షపతి, మొయినాబాద్ నాయకులు షేక్ మొహమ్మద్ నూర్ భాయ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావలి శ్రీను ముదిరాజ్, బొక్క సురేందర్ రెడ్డి, చాకలి విక్రమ్,గాండ్ల సంతోష్ కుమార్,ఎండీ యూనిస్ తదితరులు పాల్గొన్నారు
