పదో తరగతి మెమో తప్పులకు చెక్.. మీసేవలోనే సవరణలకు అవకాశం
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు దొర్లితే ఇక అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చిన్నపాటి అక్షర దోషాల సవరణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో సవరణల కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.సమీపంలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలను సమర్పించాలి. పదో తరగతి ఒరిజినల్ మెమో, టీసీ, నోటరీ అఫిడవిట్, పాఠశాల బోనఫైడ్, ఆధార్‌కార్డు వంటి ధ్రువపత్రాలు అవసరం. పుట్టిన తేదీ మార్పు కోరేవారు జనన ధ్రువపత్రాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.ఈ సేవకు రూ.80 రుసుం చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం సవరించిన మెమోను తపాలా ద్వారా అందించే విధానం ఉంది. విద్యార్థులు మధ్యవర్తులను ఆశ్రయించి అనవసరంగా డబ్బులు చెల్లించకుండా అధికారిక మార్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
