రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
రాష్ట్రపతి భవన్లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థిని.
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29 : రాష్ట్రపతి భవన్లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ ఉపాధ్యాయులు రీనా , అనీషా, గీతు చంద్రన్ మరియు విద్యార్థులు అభినందించారు. ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఒక మరపురాని గర్వకారణమైన ఘట్టమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
