ఎమ్మెల్యే కసిరెడ్డి హామీతో కోర్టు కేసు ఉపసంహరణ
- కొట్లలో స్వచ్చ జల ధార..ఆరు తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత - September 30, 2026
- ఎమ్మెల్యే కసిరెడ్డి హామీతో కోర్టు కేసు ఉపసంహరణ - September 30, 2026
- వెల్దండలో అక్రమ మద్యం తయారీ పై పోలీసుల సంయుక్త దాడులు - September 30, 2026

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని చిరు వ్యాపారులందరు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీతో కేసును ఉపసంహరించుకున్నారు.బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగం,మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కోర్టు కేసును ఎమ్మెల్యే హామీతో చిరు వ్యాపారులందరూ కలిసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు చిరు వ్యాపారులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా కాలయాపన చేయడంతో సమస్య పరిష్కారం కాకుండా కేసు కొనసాగిందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే ఆమనగల్లులో ప్రత్యేక నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని,అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మండ్లి రాములు, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, మాజీ ఎంపీపీ అనిత విజయ్‌నాయక్, కృష్ణనాయక్,పర్వతాలు,గాజుల శ్రీను, కాలే మల్లయ్య, బాబా,సురేష్,ఎంగలి ప్రసాద్,ఒగ్గు మహేష్,వెంకటేశ్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కుమార్‌గౌడ్, వస్పుల శ్రీకాంత్,ఫరీద్,రాఘవేందర్,శ్రీనునాయక్,ఫిరోజ్,కొప్పు శ్రీశైలం,శివ తదితరులు పాల్గొన్నారు.
