రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి

రాష్ట్రపతి భవన్‌లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థిని.

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29 : రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ ఉపాధ్యాయులు రీనా , అనీషా, గీతు చంద్రన్ మరియు విద్యార్థులు  అభినందించారు. ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఒక మరపురాని గర్వకారణమైన ఘట్టమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

You may also like...