Daily Archive: October 15, 2026

టీబీ రహిత గ్రామంగా జూపల్లికి జిల్లా స్థాయి అవార్డు

చారకొండ:జూపల్లి గ్రామం టీబీ (క్షయవ్యాధి) రహిత గ్రామంగా జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్న సందర్భంగా సత్య హరిచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో క్షయవ్యాధి నివారణకు కృషి చేసిన మండల వైద్యాధికారి డాక్టర్ సృజన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ) బలరాంతో పాటు ఆశా కార్యకర్తలు వలియో బేగం, సన బేగం, రజియా బేగం, భాగ్యమ్మ, దేవులీలను శాలువాలతో సన్మానించారు.అలాగే, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు!

మెకిలా రెవెన్యూ పరిధిలో అధికారుల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లవణి పట్టా భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హడావుడిగా తొలగిస్తున్న సిబ్బంది, నాళా భూములను ఆక్రమించి చేపట్టిన పెద్దల నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  సామాన్యుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకునే యంత్రాంగం, బడాబాబుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వీరికి ఉన్నతాధికారుల నుంచి అండదండలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు.. పేదలకు…

కూతురి ప్రాణాల కోసం తల్లిదండ్రుల వేడుకోలు! రూ.25 లక్షలు ఖర్చు చేసినా మెరుగుపడని ఆరోగ్యం

పెద్దకొత్తపల్లి: కన్న కూతురికి వైద్యం చేయించేందుకు ఉన్న అర ఎకరం భూమిని అమ్మి, అప్పులు చేసి ఇప్పటివరకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నిరుపేద తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కూలీలు గండు సన్నయ్య, రాములమ్మ దంపతుల 25 ఏళ్ల కుమార్తె చిన్నమ్మ ఆరేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. కిడ్నీలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతోనూ బాధపడుతున్నట్లు…

బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి భరోసా

మాడ్గుల్ :రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన దివంగత హనుమండ్ల దశరథం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ కంచన పల్లి సత్తయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల పెద్దయ్య, తిరుమల్ల లక్ష్మయ్య, బండ శ్రీనివాస్,…

పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..జంగిలి యాదగిరి

వెల్దండ:మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వెల్దండ మండల బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు జంగిలి యాదగిరి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వెల్దండ తహసీల్దార్‌ కార్తీక్‌ కుమార్‌కు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో విద్యావంతులైన యువత, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని…

పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి సుంకిరెడ్డి రూ.6.80 లక్షల సహకారం

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.6.80 లక్షల సహకారం అందించిన రాఘవేందర్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి…

ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ అక్టోబర్ 14 : ‌ఎల్ఐసిలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఐసీఈయూ సికింద్రాబాద్ డివిజన్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం, 14 అక్టోబర్ 2026 న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లగొండ బ్రాంచ్-1,2ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు….

డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్..170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ స్వాధీనం

ఆమనగల్లు:డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ కే. నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బబుల్ ఉమ్మర్ అబ్దుల్ అజీజ్ (34), హంసత్ ఫాసన్ (32)లను అరెస్టు చేశారు.నిందితులు…

ఆలయ నిర్మాణానికి భక్తుల విరాళాల వెల్లువ..రూ.3.52 లక్షలకు పైగా విరాళాలు

వెల్దండ అక్టోబర్ 14: వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీ శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి భక్తులు విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు ఉదారంగా విరాళాలు అందించారు.మండే గుత్తల విజయ్ కుమార్, భద్రప్ప, శివలింగం రూ.1,00,116 విరాళంగా అందించగా, యెడ్ల శృతి (మున్నీ), ఆమె భర్త యెడ్ల ప్రభాకర్ రెడ్డి రూ.50 వేలు సమర్పించారు. అదేవిధంగా కొండారెడ్డి పల్లికి చెందిన కోసిరెడ్డి విజయలక్ష్మి రూ.51,116, బుడ్డోన్‌పల్లికి చెందిన ముత్యాల అరుణమ్మ,…

భిక్నూర్ గ్రామంలో నూతన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ గ్రామంలో *రూ.10 లక్షల వ్యయంతో* నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రారంభించారు. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమకు ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ…