దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఎంఆర్ఓ అశోక్ – సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్
- నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి! - September 25, 2026
- కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం సమరం - September 25, 2026
- ఓటర్లపై నోటీసులు.. మహేశ్ గౌడ్ ఫైర్ - September 25, 2026

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి :
మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి పలు సూచనలు చేశారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంఆర్ఓ అశోక్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆర్ఐ నిఖిల్, దత్ సార్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, మండల స్థాయి అధికారులు, బీఎల్‌వోలు (BLOలు), బీఎల్‌ఏలు (BLAలు) దరఖాస్తుల పరిశీలన, నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు.
మల్కాపూర్ సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్ కూడా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాగునీరు, కూర్చునే సదుపాయం తదితర అవసరమైన వసతులు కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా అవగాహన కల్పిస్తూ, దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ విజయవంతం కావడానికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు.
గ్రామంలో ఇప్పటివరకు సుమారు 90 శాతం దరఖాస్తుల ఫారాల సమర్పణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా దరఖాస్తులు సమర్పించని అర్హులైన వారు చివరి అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ శాఖ అధికారులు, మండల యంత్రాంగం, గ్రామపంచాయతీ, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా కొనసాగిందని అధికారులు తెలిపారు.
