ఆర్. కృష్ణయ్యకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండమీది వెంకటేష్


హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ వర్గాల రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆర్. కృష్ణయ్య చేస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని వెంకటేష్ కొనియాడారు. బీసీలకు సమాన అవకాశాలు, న్యాయమైన ప్రాతినిధ్యం దక్కే వరకు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, లింగం ముదిరాజ్, చీర సాయి, గొల్ల వెంకటేశం పాల్గొన్నారు. ఆర్. కృష్ణయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

You may also like...