420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు
- 420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు - September 7, 2026
- డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి - September 7, 2026
- ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స - September 7, 2026
420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు
ప్రజావాణిలో తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకుల వినతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తహసీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. హామీలను నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీ అందించాలని, మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. రైతులందరికీ ప్రతి పంటకు రైతుభరోసా, పంటలకు బోనస్, కొరత లేకుండా ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంతో పాటు జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని అన్నారు. విద్యార్థులకు విద్యా భరోసా కల్పించి, పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్, ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, విద్యార్థులు, యువత, రైతులకు సంబంధించిన అన్ని డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు మురుగు, చెత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, నాయకులు గుండెగోని రాములు, పనస సైదులు, బీరెల్లి ప్రసాద్, వడ్డే సైదిరెడ్డి, షేక్ జానీ పాషా, వనం దుర్గయ్య, ఊట్కూరు శంకర్, అంతటి శీను, చెవుగోని జనార్ధన్, పోగుల సాయి, నలమాద సైదులు జీడిపల్లి ఉపేందర్ రెడ్డి , మంగదుట్ల వెంకన్న, మేడి రాములు, బొల్లెద్దు యాదయ్య, పోగుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు

