భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
- భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు - September 22, 2026
- మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - September 22, 2026
- ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి - September 21, 2026
కట్టంగూర్: వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆకాంక్షించారు. మంగళవారం కట్టంగూర్ మండలం పామనగుండ్లలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బండారు ఆనంద్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్రెడ్డి, బండారు నాగేష్, వెంకన్న, బండారు ఎల్లయ్య, యాదయ్య, ముఖేష్, పంతంగి ఉదయ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.
