లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్ గుడిపాటి శివప్రసాద్, పద్మ దంపతుల దాతృత్వంతో శుక్రవారం కట్టంగూర్ లో వికలాంగులు, నిరుపేద పిల్లలు, వృద్ధులు కలిపి సుమారు 100 మందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్లబ్ అడ్వైజర్ లయన్ సాగర్ రెడ్డిపల్లి, సెక్రటరీ లయన్ మంగదుడ్ల శ్రీనివాస్, కోశాధికారి లయన్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ లయన్ వినోద్ కుమార్, లయన్ సభ్యులు బొడ్డుపల్లి వెంకన్న, చిట్టిప్రోలు మురళి, ఉమాపతి, రామకృష్ణ, సోమేశ్, జిల్లా అశోక్, మన్యం అంజయ్య పాల్గొన్నారు.1000365782.jpg

You may also like...