హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. ప్రజాక్షేత్రంలో రేవంత్ ప్రభుత్వం అభాసుపాలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

జ్ఞాన తెలంగాణ, ​కట్టంగూరు, అక్టోబర్ 7:

శాసనసభ ఎన్నికల వేళ కోకొల్లలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేక పూర్తిగా అభాసుపాలైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

​​బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బినామీ కంపెనీల పేరిట వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేస్తున్నారని, ఈ అక్రమాలను ప్రశ్నించిన బిఆర్‌ఎస్ ప్రతినిధులు, సోషల్ మీడియా నాయకుడు మన్నె క్రిషాంక్ లాంటి దళిత నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. 

​రాష్ట్రంలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లందిస్తే, నేడనాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లను ఆంధ్రప్రాంతానికి తరలిస్తుంటే నిలదీసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. పత్తి పంటకు పెట్టుబడి పెట్టి ఎకరానికి 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పిటిసి తరాల బలరాములు నాయకులు పోగుల నర్సింహ్మ , ఐటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్ పెద్ది బాల నరసయ్య, గుండగోని రాములు, బీరేలి ప్రసాద్, చౌగోని జనార్ధన్, నోముల వెంకటేశ్వర్లు, అంతటి శ్రీను బుల్లి యాదయ్య పోగుల అంజయ్య ,గోగు సైదులు, అంతటి గణేష్ తదితరులు పాల్గొన్నారు

​

You may also like...