పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు

రూ.5610 నగదు, 6సెల్ పోన్లు, 6 బైక్ లు స్వాధీనం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంతో కట్టంగూర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం సాయంత్రం సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామ పరిధిలోని కుమ్మరి గూడెం చెరువుకట్టపై 12 మంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులో తీసుకున్నారు. పోలీసులను గమనించిన నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.5610 నగదు, 6 బైక్ లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పరారైన నలుగురిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.

You may also like...