బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.
- SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు… - October 8, 2026
- బతుకమ్మ దసరా సందర్భంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేసిన పాలకవర్గం… - October 8, 2026
- బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. - October 8, 2026
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులను షబ్బీర్ అలీ గారు అభినందించారు. రైతులకు అండగా PACSలు పనిచేయాలి.
