మహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం – ఎర్రవల్లి భూనిర్వాసితులు
- వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు - September 22, 2026
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026
ఎర్రవల్లి భూ నిర్వాసితుల ఆందోళన 295వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా స్థలంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.ఈ నెల 27న ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న మహా పాదయాత్రకు బాధితులుగా పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.
అనంతరం అజిలాపూర్, ఇర్విన్ గ్రామాల్లో మహా పాదయాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, ఖలీల్‌తో పాటు ఎర్రవల్లి భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
