స్వచ్ఛమైన నీరు – సంపూర్ణ ఆరోగ్యమే ఐక్యత పౌండేషన్ లక్ష్యం: సుంకిరెడ్డి
- దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య - September 8, 2026
- రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి - September 8, 2026
- స్వచ్ఛమైన నీరు – సంపూర్ణ ఆరోగ్యమే ఐక్యత పౌండేషన్ లక్ష్యం: సుంకిరెడ్డి - September 8, 2026
వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి బొట్టు స్వచ్ఛత కోసం ఐక్యత ఫౌండేషన్ అడుగు ముందుకు వేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, వార్డు సభ్యులు కట్ట పద్మమ్మ, వెంకట్ రావు, రామాంజనేయులు,బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ చారి, సత్తూరి శేఖర్,కట్ట జంగయ్య, నర్సిరెడ్డి, మొకురాల జంగయ్య, రమేష్, గ్రామ యువత, మహిళా సంఘ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.అనంతరం గ్రామస్తులు ఐక్యత ఫౌండేషన్ సేవలను అభినందించారు.
