వరుసగా రెండోసారి లడ్డు దక్కించుకున్న రేవెల్లి దర్గయ్య.. భారీగా రూ. 65000
- గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం - September 25, 2026
- యువతకు సాంకేతిక నైపుణ్యాలు – 5500 మందికి శిక్షణ - September 25, 2026
- వరుసగా రెండోసారి లడ్డు దక్కించుకున్న రేవెల్లి దర్గయ్య.. భారీగా రూ. 65000 - September 25, 2026

వెల్దండ: వినాయక చవితి సందర్భంగా శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది. వేలంపాటలో రేవల్లి దర్గయ్య వరుసగా రెండోసారి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి రూ.65 వేల ధరకు లడ్డూను దక్కించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై దర్గయ్యకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, శ్రీరామ గణేష్ యూత్, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
