సీఎం ఆర్ఎస్ఎస్ చెక్కు అందజేసిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026
వెల్దండ, సెప్టెంబర్ 18:
వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన గోరంట్ల మహేష్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) రూ.19,500 చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మహేష్‌కు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దినేష్ సాగర్ పాల్గొన్నారు.
