విద్యతోనే సామాజిక అభ్యున్నతి సాధ్యం..స్వేరో దుబ్బ నాగేష్
- విద్యతోనే సామాజిక అభ్యున్నతి సాధ్యం..స్వేరో దుబ్బ నాగేష్ - October 22, 2026
- ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి - October 22, 2026
- వినయ్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల రూ.20 వేల ఆర్థిక సాయం - October 22, 2026

వెల్దండ:విద్య ద్వారానే సామాజిక అసమానతలను అధిగమించి సమాజంలో సమాన అవకాశాలు సాధ్యమవుతాయని సీనియర్ స్వేరో దుబ్బ నాగేష్ అన్నారు.గురువారం వెల్దండ మండలం రాచూరు గ్రామంలో స్వేరోస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు విక్టరీ డేను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎస్ఆర్ శంకరన్ చేసిన కృషి మరువలేనిదన్నారు.తెలంగాణ గురుకులాలు విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషి కీలకమని నాగేష్ అన్నారు.పోలీసు ఉద్యోగాన్ని వదిలి గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నాయకత్వంలో మలావత్ పూర్ణ వంటి ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం, ఆత్మగౌరవం అనే లక్ష్యాలతో స్వేరోస్ సమాజం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బ కృష్ణయ్య, ఎల్లయ్య, శెట్టిపల్లి యాదయ్య, వార్డు సభ్యులు రామార్జున్,లక్ష్మీ వెంకటేష్, సలేశ్వరం, రాఘవేందర్,సుభాష్, సురేష్, కొమ్ము కృష్ణ, మల్లేష్,డాక్టర్ వెంకటయ్య,గంగయ్యతో పాటు పలువురు చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు.
