క్రెడిట్ కార్డు ఛార్జీల పెంపు.. వినియోగదారులకు షాక్!
- చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు! - November 18, 2026
- సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ - November 18, 2026
- ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్! - November 18, 2026

బిజినెస్ వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక మార్పులు ప్రకటించింది. విదేశీ కరెన్సీ లావాదేవీలపై విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (డీసీసీ) ఛార్జీలను ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 3.50 శాతానికి పెంచనుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో విదేశాల్లో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అంతర్జాతీయ కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాల సమయంలో కార్డులను వినియోగించే వారు ఇకపై లావాదేవీల ఛార్జీలను ముందుగానే పరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మరోవైపు డిసెంబర్ 15 నుంచి రూబీఎక్స్, కోరల్, ఎక్స్ప్రెషన్స్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న కొన్ని ప్రయోజనాలను బ్యాంక్ నిలిపివేయనుంది. ఇందులో భాగంగా ఉచిత సినిమా టిక్కెట్లు, వ్యక్తిగత బీమా, విమాన ప్రమాద బీమా సదుపాయాలను ఉపసంహరించుకోనుంది. ఇప్పటివరకు ఈ ప్రయోజనాలను పొందుతున్న వినియోగదారులు తాజా మార్పులను గమనించాల్సి ఉంటుంది.
ఒకవైపు విదేశీ లావాదేవీలపై ఛార్జీల పెంపు, మరోవైపు కార్డు ప్రయోజనాల తొలగింపుతో వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసేవారు, ఆయా క్రెడిట్ కార్డుల ప్రయోజనాలపై ఆధారపడేవారు బ్యాంకు ప్రకటించిన కొత్త నిబంధనలను పరిశీలించి తమ ఖర్చులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
