బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గండికోట రాజు

1001374637.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 18 : నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వెల్దండ మండలం తిమినోనిపల్లి గ్రామానికి చెందిన గండికోట రాజు నియమితులయ్యారు. బుధవారం బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా గండికోట రాజు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

You may also like...