అత్తాపూర్ పోలీసుల మెరుపు వేగం గంటలోపే చిన్నారి ఆచూకీ లభ్యం.

419885.jpg

అత్తాపూర్ : అత్తాపూర్ మరియు బహదూర్‌పుర పోలీసుల సత్వర స్పందన సమన్వయంతో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి సబ్రీన్ ఖాతూన్ కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరింది.

సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక హోటల్ సమీపంలో చిన్నారి ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చిన్నారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు వచ్చే వరకు పాప భయపడకుండా ఆమెకు ధైర్యం చెప్పి, ఎంతో ఆప్యాయతతో జాగ్రత్తగా చూసుకున్నారు.

ఉదయం నుంచి ఎంతో ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి మధ్యాహ్నం 12:30 గంటల కల్లా చిన్నారి సబ్రీన్ సురక్షితంగా తిరిగి దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ బిడ్డను వేగంగా గుర్తించి ఎంతో ప్రేమతో చూసుకున్న పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...