కొట్రలో ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత.. సిమెంట్ అందజేత
- ఆమనగల్లులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన - October 4, 2026
- కొట్రలో ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత.. సిమెంట్ అందజేత - October 4, 2026
- మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత - October 4, 2026
వెల్దండ, అక్టోబర్ 03 : కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్, ఆర్థిక సాయం అందజేశారు. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎంపీటీసీ రాములు ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పల ట్రస్ట్ సభ్యులు, బీఆర్‌ఎస్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించి బాధిత కుటుంబాలకు సహాయం అందించారు.ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉప్పల ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరికొందరు నిరుపేద కుటుంబాలకు కూడా సహాయం అందించేలా కృషి చేస్తానని చెప్పారు.సహాయం పొందిన వారిలో కొప్పు రాధిక–పర్వతాలు, దేశమని సునీత–సీనయ్య, కొప్పు జంగమ్మ–బాల్ లింగమయ్య, ఉడుతల రాధిక–అల్లాజీ, షాంపూరి వెంకటమ్మ–చిన్న కాశన్న కుటుంబాలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పల ట్రస్ట్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ రాములు, ఉడుతల అల్లాజీ తదితరులు పాల్గొన్నారు.
