బొల్లంపల్లిలో కమనీయంగా ఉట్ల పండుగ వేడుకలు
- ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి - September 6, 2026
- వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 6, 2026
- ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు - September 6, 2026
వెల్దండ సెప్టెంబర్ 05: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్ల వేడుకలను కమనీయంగా నిర్వహించారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి పర్వదిన వేడుకలు మన సంస్కృతి, సంప్రదాయాలను ఆద్యాత్మిక శోభను భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరూ ఐక్య మత్యంగా పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. రానున్న రోజుల్లో ఆద్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరి భాగస్వామ్యంతో మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి, నాయకులు ఆలంపల్లి కృష్ణ, కానుగుల పర్వతాలు,వెంకట్ రావ్,వార్డు సభ్యులు, మరియు యాదవ సంఘం సభ్యులు మల్లయ్య, శ్రీనివాస్, అల్లాజి, మల్లేష్,శివ, అంజయ్య, ఉప్పల పర్వతాలు, సోమయ్య, కొండల్ యాదవ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
