ఆమనగల్ లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

1001190931.jpg

ఆమనగల్, సెప్టెంబర్ 18: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఆమనగల్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమనగల్‌లోని సూర సముద్రం చెరువు నిమజ్జన ప్రాంతాన్ని మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి శుక్రవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులు సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమనగల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు.

You may also like...