రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, IAS, మీకాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించి సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు సమ్మిట్ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, IAS, అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఇతర సాంకేతిక ఏర్పాట్లపై వివరించారు.
సమ్మిట్ జరిగే మూడు రోజుల పాటు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడం ద్వారా గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు TGSPDCL పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.
