డ్రైనేజీ సమస్యపై నార్ని శ్రీనివాసరావు పరిశీలన

హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ ఫేజ్‌-1లో సెవెరేజ్, స్ట్రామ్ వాటర్ లైన్లు బ్లాక్ కావడంతో ప్రతిరోజూ డ్రైనేజీ పొంగిపొర్లుతున్న సమస్యను కాలనీవాసుల ఫిర్యాదు మేరకు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పరిశీలించారు. PAC చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు జలమండలి అధికారులతో కలిసి సమస్యను పరిశీలించి, తక్షణమే లైన్లను శుభ్రపరచడంతో పాటు బకెట్ క్లీనింగ్ చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ విలియం ప్రకాష్, సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నివాసితులు పాల్గొన్నారు.

You may also like...