స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్‌ గుల్లి నరేష్‌

స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్‌ గుల్లి నరేష్‌జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 7: ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునుకుంట్ల గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్‌ అన్నారు. మండలంలోని మునుకుంట్ల గ్రామంలో బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌ కార్డులు…

6 హోటళ్లకు షాక్.. లైసెన్సులు సస్పెండ్…

కామారెడ్డి జిల్లా, భిక్‌నూర్ మండలం NH-44పై TGSAFE 10 బృందాలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాయి. వంటగదుల్లో బూజు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, గడువు దాటిన ఫుడ్, సరిగా నిల్వ చేయని చికెన్, మటన్, ఫిష్‌లను గుర్తించారు. జైకా మల్టీ క్యుజిన్(బస్వాపూర్), మాల్గుడి, వసుధ(భిక్‌నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్, లుఫియన్స్ ఫ్యామిలీ(అడ్లూర్), తాజ్ ఫ్యామిలీ ధాబా(సదాశివనగర్) హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఈ హోటళ్లన్నింటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

రామారెడ్డి పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సదుపాయాలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. మందులు,…

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం – 35 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ఆమనగల్ అక్టోబర్ 07:గంజాయి అక్రమ రవాణా, సేవనంపై కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. ఆమనగల్లు మార్కెట్‌ యార్డు సమీపంలో పోలీసులు, ఎస్‌ఓటీ బృందం నిర్వహించిన తనిఖీల్లో 17 ప్యాకెట్లలో ఉన్న సుమారు 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.నిందితులను అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన కుంజం చందుబాబుదొర (26), కోసు వెంకటసాయిబాబు దొర (23)గా గుర్తించారు.వారి వద్ద గంజాయితో పాటు వివో మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం…

ప్రభుత్వ భవన స్థలాలను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్: చిన్నంబావి మండల కేంద్రంలో కల్చరల్‌ బిల్డింగ్‌, స్టేడియం, పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరిశీలించారు. పెద్దమారూర్‌ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 113లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.కల్టివేషన్‌ లేకుండా బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. అవసరమైన స్థలాన్ని గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం చిన్నంబావి మండల…

భూ సర్వేను అడ్డుకున్న అజిలాపూర్ రైతులు

వెల్దండ అక్టోబర్‌ 7: డిండి–నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారంపై స్పష్టత వచ్చే వరకు భూ సర్వేకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు.బుధవారం వెల్దండ మండలం అజిలాపూర్‌లో అధికారులు పోలీసు బందోబస్తుతో చెట్ల లెక్కింపు చేపట్టగా, ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ రైతులు అడ్డుకున్నారు.సర్పంచ్‌ సిద్ధగోని రమేష్‌గౌడ్‌తో కలిసి రైతులు నిరసన తెలిపారు. పరిహారం పెంచడంతో పాటు భూములు కోల్పోతున్న ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్‌ కోసం 187 ఎకరాల…

ఇంటి నిర్మాణానికి ఉప్పల ట్రస్ట్ సిమెంట్ విరాళం

వెల్దండ: వెల్దండ మండలానికి చెందిన బొక్కల నరసింహ తండ్రి రాములు ఇంటి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సిమెంట్ అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగయ్య, బాదేపల్లి గోపాల్ కుమార్,…

చేవెళ్ల బస్టాండు వద్ద దారుణ హత్య

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కునే క్రమంలో అతడిపై దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం...

శంకర్ పల్లి లో స్క్రాప్ షాపులో కత్తితో బెదిరించి దోపిడీ

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ ఫ్లైఓవర్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిపై ఉన్న స్క్రాప్ షాపులో రాజు (26) ఉండగా, తెల్లని స్కూటీపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు రాజు మెడపై కత్తి...

సీఈసీ రాజీనామా వరకు పోరుఆగదు

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని తీవ్రంగా...