వియత్నాంలో పర్యటించిన వెల్దండ ప్రముఖులు

వెల్దండ: వియత్నాం దేశ పర్యటనలో భాగంగా వెల్దండకు చెందిన పలువురు ప్రముఖులు పర్యటించారు. పర్యటనలో భాగంగా తానాంగ్‌ ప్రాంతంలో కేబుల్‌ కార్‌లో ప్రయాణించి అక్కడి ప్రకృతి అందాలను వీక్షించారు.ఈ పర్యటనలో డీసీసీ ఉపాధ్యక్షులు, వెల్దండ మాజీ సర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, డివిజన్‌ రెవెన్యూ అధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు ఎన్నం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ఇండీ కూటమి ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీలో ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్ట్‌

‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్‌ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

నార్సింగిలో అధికారులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక సమీక్ష: అభివృద్ధి పనుల వేగవంతానికి ఆదేశం

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ అమిత్ నారాయణ (IAS) తో కలిసి ఎమ్మెల్యే ఈ సమావేశాన్ని నిర్వహించారు.

న్యూ ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026)

ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోరమ్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026) 10వ ఎడిషన్ న్యూ ఢిల్లీలోని ద్వారకలో గల యశోభూమి (IICC) కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది.

నానా పటేకర్‌ కన్నుమూత

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత నానా పటేకర్‌ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం 5.20 గంటలకు ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నానా పటేకర్‌ మరణవార్తతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణంతో...

బీబీపేట్ PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు….

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. ప్రజాక్షేత్రంలో రేవంత్ ప్రభుత్వం అభాసుపాలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. ప్రజాక్షేత్రంలో రేవంత్ ప్రభుత్వం అభాసుపాలునకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, ​కట్టంగూరు, అక్టోబర్ 7:శాసనసభ ఎన్నికల వేళ కోకొల్లలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేక పూర్తిగా అభాసుపాలైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ ప్రజలను మోసం…

అనారోగ్యంతో మాజీ ఎంపిటిసి మృతి

అనారోగ్యంతో మాజీ ఎంపిటిసి మృతి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్  7 : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది శేరి చత్రపతి సతీమణి మాజీ ఎంపిటిసి శేరి అనురాధ మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కట్టంగూర్ లోని స్వగృహంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్…

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కలిసిన అంబేద్కర్ సంఘ సభ్యులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం అక్కడినుండి తీపించి మున్సిపల్ ఆఫీస్ లో భద్రంగా ఉంచగలరని, రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రోడ్డు మధ్యలో మిడిల్ పాయింట్ చూసి దానిని పెట్టగలరని, ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ గారు మధ్యలోనే పెట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో…

నవంబర్ 1, 2 తేదీలలో టీఎస్ యుటిఎఫ్ 7వ జిల్లా మహాసభలు

నవంబర్ 1, 2 తేదీలలో టీఎస్ యుటిఎఫ్  7వ జిల్లా మహాసభలు జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 7 : నవంబర్ 1, 2 తేదీలలో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా 7వ మహాసభల కరపత్రాన్ని మండల విద్యాశాఖాధికారి  ఎం.శ్రీలత, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ.అంజయ్య గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల సాధనతో పాటు, సమాజ…