ఇంటి నిర్మాణానికి ఉప్పల ట్రస్ట్ సిమెంట్ విరాళం

వెల్దండ: వెల్దండ మండలానికి చెందిన బొక్కల నరసింహ తండ్రి రాములు ఇంటి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సిమెంట్ అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగయ్య, బాదేపల్లి గోపాల్ కుమార్, ముదిరాజు జంగిలి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.1001244037.jpg

You may also like...