శంకర్ పల్లి లో స్క్రాప్ షాపులో కత్తితో బెదిరించి దోపిడీ
- పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వైపు ఇండీ కూటమి నేతలు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన - October 8, 2026

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఫతేపూర్ ఫ్లైఓవర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిపై ఉన్న స్క్రాప్ షాపులో రాజు (26) ఉండగా, తెల్లని స్కూటీపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు.
వారిలో ఒకరు రాజు మెడపై కత్తి పెట్టి బెదిరించగా, మిగిలిన ఇద్దరు షాపులో తనిఖీ చేసి రూ.30,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో రాజు చెంపకు కత్తితో గాయమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
