హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. హరీశ్‌రావుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివాహ ఏర్పాట్లపై చర్చ జరిగింది. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌడి చర్ల లలిత నరసింహ తెలిపారు. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులను వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్ బండమీది వెంకటేష్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కుర్వ విజయ్, బీఆర్‌ఎస్ నాయకులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...