లంచం వసూళ్లకు తెరలేపిన తహసీల్దార్.. ఏసీబీకి చిక్కిన సృజన్‌కుమార్
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026
జ్ఞాన తెలంగాణ, ములుగు: గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్‌కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తండ్రి, కొడుకుల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. లంచం డిమాండ్, ఏసీబీ చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
